2005 ఆగస్ట్ ..మా ప్రాజెక్ట్ క్లయంట్ కి ఇచ్చే రొజు వచ్చింది... నేను స్పెయిన్ కి వెళ్లాను..నా ప్రొజెక్ట్ గురించి..ఎమనుకుంటున్నరో అని కుతూహలంగా ఉంది ... నాకు వాళ్లు మాట్లాడుకుంటున్నవి అర్థం చేసుకొవటం ... దాదాపుగా అసంభవం అని తెలిసి వచ్చింది...కానీ..వాళ్ళు మట్లాడుకుంటున్నవి వింటానికి.. ఒక చెవ్వు అటు పడేశాను.....అందులో ఒక రెండు పదాలు..ఎక్కువగా వినిపించాయి..అవి..
" సీ...సీ....బాలె ..బాలె .. "
ఇంత కష్టపడి మేము చేసిన పనిని ..బాలె బాలె అని అంటున్నారేంటా అని కొంచెం ఆలొచించి.,.గూగుల్ చెయ్యగా తెలియవచ్చిందేంటంటే...'బాలే' అంటే స్పానిష్ లో సరే ( మన భాషలొ ఓ.కె. అని ;-) ) అని అర్థం...
...ఈ స్పానిష్ "బెక బెక" లు...మేము అక్కడ చాలా రోజులు భరించాము...అయినా ప్రపంచం లో చాలా ప్రాముఖ్యమైన భాషల్లొ ఒకటైన ఈ స్పానిష్ ని ఎప్పటికైనా నేర్చుకోవాలని అనిపిస్తుంది...
చాలా వరకు..వీరి యాస.. మన భాషలకి దగ్గరగా ఉంటుంది....చాలా తెలుగు పదాల్లాగా అనిపిస్తాయి కూడా....తెలుగు తో పొలిన వింతైన కొన్ని స్పానిష్ పదాలు ..వాటి అర్థాలు.. ఇదిగొ ఇక్కడ ఇంకొన్ని చెప్పనా?
స్పానిష్ లొ ..
దూడ అంటే సందేహం
దెవుడా అంటే అప్పు.. (దేవుడా...)
తింతా అంటే ఇంకు.. సిరా. (చిన్న ఫిల్లలు తింటానికి...తింతా అన్నట్లుగా )
రాణా అంటే కప్ప...( "బెక బెక" )
హొర అంటే అవర్ ( హవర్) (మన పంచాఙ్ఞము లలో ఇన్ని హొర లని సమయాన్ని లెక్క పెట్టే విధానం ఉంది )
సాలా అంటే రూం ( ఎయిర్ పోర్ట్ లొ... వీఐపి ల వెయిటింగ్ రూం కి.. "సాలా వీఐపి" అని పెద్ద పెద్ద అక్షరాలతో ..రాసినప్పుడు.. నాకు నవ్వాగలేదు... :D)
మంగొస్తా అంటే ముంగీస ...( మంగ ని అడిగి చుద్దాం..:P )
చర్ల అంటే కబుర్లు.. చాట్
వెంగా / బెంగ అంటే .. రా రమ్మని...
చిక అంటే ప్రియురాలు.. ( యే చికితా..)
ఎన్ సంచార్ అంటే సాగదీయు..పొడిగించు..
అమాంతే అంటే ప్రియుడు / ప్రియురాలు
బాల అంటే తూటా .......
మన తెలుగు పాటల్లో.. కూడా.. స్పానిష్ అప్పుడప్పుడూ వింటున్నాం కదా....
"హేయ్ చికితా ...కుమస్తాజ్..." అని గొంతు చించుకుని పవన్ కల్యాన్..పాడినప్పుడు అర్థం కాలేదు ఈ భావావేషం..(అనువదిస్తే యే పిల్లా...యేంది కతా... అని మాస్ గా..లెకపొతే..ఓ..ప్రియా...కుశలమా... అని క్లాస్ గా)
అలాగే షకలక బేబి ...పాటలొ... చివరగా "అదెదొ వస్తదా మీకు" అన్నట్లుగా సుస్మితా సేన్ వినిపించే కూత కూడ.. స్పానిష్ దె..."అడియొస్ అమిగొస్".. ..బై బై ..ఫ్రెండ్స్.. అని అర్థం ..
ఇక అమెరికా లొ స్పానిష్ విషయానికొస్తే .. ఎక్కువగా స్పానిష్ మట్లాడే వాల్లు ఉన్నారన్నది ..అందరికీ తెలిసినదే కదా..ఒకసారి అక్కడ యెదో రాష్త్రం లొ..పార్లమెంటు సమావేశాలలొ.. ఇంగ్లిష్ ని రాష్త్ర భాషగా గుర్తించడానికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు అని గవర్నర్ ఆవేశంగా అంటే ..అందరూ చెయ్యెత్తి.. "సీ" అని స్పానిష్ లొ(Si means 'Yes') అన్నారంట... అది విని ఆ గవర్నెర్ నెత్తి పట్టుకోవల్సొచ్చింది...
అలాగే... చాలా ఈంగ్లిష్ సినిమాలలో వినే ఇంకో పదం "గ్రాసియాస్" .. అంటె మన భాషలొ థాంక్స్...తెలుగు లో ..కృతఙ్ఞతలు అని....
ఇక స్పానిష్ పదాలు ఎలా ఉంటాయంటే...మీరెప్పుడైనా బాంగలూరు వెల్లారా... అక్కడ ..కన్నడ వాళ్ళ లిపి మన తెలుగు లిపి లాగానే ఉంటుంది..కాని చదివి చూస్తె వింతగా...అక్కడ కనిపించే బోర్డ్ పై...బంగలూరో...కర్నాటకో...హొటెలో..రెస్తారెంటో...ఇలా అన్ని వాల్లకే అదెంటో తెలీదన్నట్లు రాసుకున్నరేంటా అనిపిస్తుంది కదా... అలాగే స్పానిష్ కూడా......!!!
ఇంగ్లిష్ లొ చాలా వాటికి అలా "ఓఓ" అని కలిపితే ..స్పానిష్ పదాలు వచ్చేస్తాయి...... :D
10 comments:
halO palakA-balapam gAru
mI balapaaniki konni vattulu, hallulu, acculu nErpincanDi. palaka mIda sariggA rAyanDi sAr.
Hope it did not sound rude. Atleast when writing in telugu, please try to pay attention to the detail. That's the intention of my comment
@రమేష్
అవి స్పానిష్ పదాలండీ..మన పదాలకి సారుప్యంగా ఉంటాయి కానీ...మొత్తం గా మన పదాలు కావు...అందుకే...ఆ వత్తులు..హల్లుల తేడా....బహుశా...నేను వినీ వినీ కొత్తగా అనిపించక పోయినా..మొదటగా చదివే వారికి...తెలుగు తప్పుగా రాసినట్లు అనిపిస్తుంది అని తెలియ చేసినందుకు..థాంక్స్..
గురూ గారూ
నేను స్పానిష్ పదాల గురించి మాట్లాడట్లేదు అండి. ఉదాహరణకు మీ వాక్యం చూడండి.
"నేను స్పెయిన్ కి వెల్లాను..నా ప్రొజెక్ట్ గురించి..ఎమనుకుంటున్నరో అని కుతూహలంగా ఉంది ... నాకు వాల్లు మాట్లాడుకుంటున్నవి అర్థం చేసుకొవటం "
ఇందులో "వెల్లాను, ఎమనుకుంటున్నరొ, వాల్లు, చేసుకొవటం" ఇలాంటివి అన్నమాట.
:)
బావున్నాయి స్పానిష్ పదాలు...
చికీతా గుమొస్తాస్ అని వెంటనే పాడాలి :)
@Ramesh..
:) తప్పకుండా ...thank you..!
@Praveen
All the best..! :)
baagundi post
కొమేస్ (ఎలా) తాస్ (నువ్వు)
ఫ్రెంచి భాషకి స్పానిషు భాష చాలా పోలి ఉంటుంది. (ఇటాలియను, పోర్చుగీసు, రొమానియను తో సహా - లాటిను భాషలు) చివర్లు మారుతూ ఉంటాయి.
సాల్ (ఫ్రెంచిలో)- రూము - సాలా (స్పానిషులో)
కొమ్మాన్ (ఫ్రెంచిలో)- ఎలా - కొమేస్ (స్పానిషులో)
స్పెయినులో మీరు బాగా ఎంజాయి చేసారన్నమాట. వాళ్ళ డాన్సులు కూడా చూసారా ? మంచి సరదా మనుషులు
హోటలో, బారో అని ఓత్వంలాగా కనిరించేది నిజానికి పొల్లు. హోటల్, బార్ అన్నమాట. స్పానిష్ భాష నేర్చుకోవడం నేను ప్రారంభించాను, ఫరవాలేదు, కొంతవరకూ సాధించాం :)
chala bavundi me blog
బాగుంది... స్పానిషీయం.. :)
Post a Comment