Saturday, September 29, 2007

"లకోటా ప్రశ్న"(Bita) ...అడగండి...వెంటనే మీకు జవాబులు రడీ..!!

మనం బ్లాగుల్లో ..పేపర్లలో.. రొజూ చూస్తున్న ప్రశ్నలు... "రాముడున్నాడా..?" ..."చిరంజీవి పార్టీ పెడ్తాడా...?" ........" చిరుత విజయం సాధిస్తుందా...? "మధ్యంతరం వస్తుందా.?" "తెలంగాణా లొల్లి యేమయిద్ది..".....మరి ఇలాంటి ప్రశ్నలకి జవాబుల కోసం మనందరం బుర్ర బద్దలు కొట్టుకోకుండా..నేనొక చిన్న సాధనం తయారు చేశా ..ఇదిగో నా బ్లాగులో పక్కనే పైన ఉన్న డబ్బాలో మీ ప్రశ్న రాయండి...వెంటనే జవాబు మీకు కనిపిస్తుంది.....ఇదేదో అల్లా టప్పా విద్య కాదండొయ్... నా ఆరవ తరగతి ఎండాకాలం సెలవుల్లో మా తాతయ్య నేర్పిన "లకోటా ప్రశ్న" చెఫ్ఫే విధానం...:)) మరి అప్పటికి నాకు అర్ధం అయ్యే సులువైన విద్య అదే కనుక ..ఠక ఠకా నేర్చేసుకున్నా...జాతకశాస్త్రం మన తరాలు నమ్మటం మానేశాం ...కానీ.. అందులో నిజమైన ప్రావీణ్యం ఉన్నావారు చెప్పే విషయాలు అప్పుడప్పుడు చాలా అబ్బురపరుస్తాయి(ట) ..!

యేంటీ.. ఇదేదో... Yahoo! Answers (click to open) కి కాపీ.. లాగా ఉంది అంటారా...? మరదే...అన్ని మన వేదాల్లోనే ఉన్నాయష..! అని వినలేదా...కాకపోతే మనవాల్లు .. "లకోటా ప్రశ్నలు..." వాళ్ళు "డకోటా ఆన్సర్స్" అంతే తేడా...


మరి ఆ మాజిక్ గురించి రాసేముందు... మీరు మీ ప్రశ్నని తెలుగులో/ఇంగ్లిష్ లో ...."లకోటా ప్రశ్న"(Bita)" అనే విభాగం లో రాయండి..ఎప్పుడైతే బటన్ నొక్కుతారో మీ జవాబు మీకు కనపడుతుంది వెంటనే...(కొన్ని ఫన్నీ ప్రశ్నలని ఉదాహరణలు గా రాశా అక్కడ చూడండి..)

అందరు నవ్వుకునే విధంగా ఎమైనా ఉంటే ..మీ సరదా సరదా ప్రశ్న లు ...వాటి జవాబులు కామెంట్స్ లో రాయండి..:)

దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు..?

దీన్ని సాధారణం గా...పల్లెటూర్లలో ....యేదైనా కొత్త పని లేదా వ్యాపారం మొదలెట్టే ముందు ఆ పని చేసే వారిలో ఒక పాజిటివ్ ధ్రుక్పధాన్ని కలుగ జేసేందుకో .. లేకపొతే ఏవైనా వస్తువులు ..జంతువులు పోయినప్పుడు ( ఆవులు..గేదె లు...పల్లేటుర్లలొ మేస్తూ మెస్తూ దారి తప్పుతూ ఉంటాయి..) ....వాటి జాడ తెలియ చెప్పడానికి... ఉపయోగిస్తారు...
ఎప్పుడయితే వీరు వచ్చి "ఫ్రశ్న" అడుగుతారో ( ఉదా: రేపు నేను మొదలు పేట్టే పని సక్రమంగా అవుతుందా?").. ఆ అక్షరాల సంఖ్య ఆధారంగా కొన్ని గణాంకాలు వేసి వచిన శేషం ప్రకారం దాని జవాబు వస్తుంది...


ఇది ఎలా పని చేస్తుందంటారా...చాలా సింపుల్...:-) ఆ ఫార్ములా :

1) మీ ప్రశ్న లోని అక్షరాలని లెక్కించండి... ( దాన్ని Q అనుకుందాం )


2) ఆ సంఖ్య ని 2 చేత గుణించండి.. ( Q * 2 )


3) దానికి 12 ని కూడండి.. ( (Q * 2) + 12)


4) వచ్చిన దానిని 9 చేత భాగించండి.. ( (Q * 2) + 12) % 9 )


5) వచ్చిన శేషం ని ఈ క్రింది పద్యం తో పోల్చి జవాబు తెలుసుకోండి...


వసు ద్వితీయే నఃభవంతి కార్యం
రస చతుర్ధీ నిజ కార్య సిద్ధీ
సప్త తృతీయే కథయంతి వార్తాః
నవ యేక పంచా త్వరితం లభేత్...


వచ్చిన శేషము ...దాని అర్థం :-

8 or 2... "what you are thinking will not happen!!"

6 or 4...."Yes...This will be a success!!"

7 or 3.... "You will be knowing some news abt this very soon!!

9 or 1 or 5 ......"Yes.. but it will be realised in future"
Disclaimer : Intended for fun, use at your own risk ;)

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter