Thursday, July 26, 2007

చి లి పి @ చిం త కా య . కాం



నేటి మన కథానాయకుడి పేరు....."చిలిపి". (ఇదేమి పేరంటారా...కొంచెమాగండి..ఈ బ్లాగోతం అంతా మరి వీడి... చిలిపి పనుల గురించే) ...ఇతను.. సాలెగూడు లో సాగుబడి చేద్దామని తెలుగు వెబ్ సంతలన్నీ వెతగ్గా..వెతగ్గా... దొరికిందొక..వింతైన చోటు...అదే చింతకాయ.కాం ....
అంతే ...మన వాడికి చింతకాయని చుసేసరికి ...మౌస్ ....మనసు..ఆగలేదు...క్లిక్క్ మనిపించాడు..
హొంఫుట హాం ఫట్ అని ప్రత్యక్షమయ్యింది..


అందమయిన హొంపుట..ఎదర..హెడర్ లో...అటూ ఇటూ పేజీ కి ..చింతకాయల జే పీ జీ లు వ్రేలాడ తీసారు...పచ్చి పచ్చి గా.. ఆకుపచ్చని చింతకాయలు...క్లిక్కితె తొక్కూడుతాయా అన్నట్లున్న వాటిని చూసి.. మనవాడి..నోరూరింది..
అసలే..."ఆవలిస్తే ప్రేగులు
లెక్క పెట్టగలిగి
...యూ ఆర్ ఎల్ ఇస్తే పేజీలూ లెక్క పెట్టగలిగే మన "చిలిపివాడు.." ..చింతకాయ.కాం కి పది కి పన్నెండు మార్కులు వేసాడు ముందు పేజీ లొనే........
.వెను వెంటనే... "సయినప్ శాయరా ఢింభకా " బటన్ ని...క్లిక్కుమనిపించాడు...జై చింతకాయల భైరవీ...అని గట్టిగా అరచి....
ఆ మంత్రాలకి...నాల్గు చింతకాయలు రాలి...కీ బోర్డ్ మీద పడ్డాయి...
తరువాతి పేజిలో..చింత తొక్క యుసెర్ దరఖాస్తు ...అహా కాదు.. కాదు.. కొత్త చింత యుసెర్ దరఖాస్తు అలియాస్ ప్రశ్నా పత్రము..బార్లా తెరుచుకుంది బ్రౌజర్ లో... (వెనకటికెవరో ..ఈడు మీదున్న సైటు కి...స్పీడు ఎక్కువన్నట్లు..)
ముందు గా సూచనలు అని..ఈనాడు లో సంచలన వార్త సైజు లొ ఎర్రగా రాసి ఉంది.. ఒక ఇరవై ముప్పై రాసారు... వాటిని చదవటం మొదలెట్టాడు..,

1)పలక, బలపం ..స్కేలు...జామెట్రి డబ్బా..సైద్ధాంతిక కాలుక్యులేటర్ మీ చేతికి అందేంత దూరం లొ ఉంచుకొండి..
2) నిజాయితీగా... జవాబులు రాసిన వారికి... Internet Explorer 7 లో కూడా మా పేజీ..స్పీడ్ గా లోడ్ అవుతుంది...

ఇలా సాగాయి..............

అన్ని సూచనలు సతికాక ...అసలు పని లో పడ్డాడు...

మొదట గా పేర్లూ...గొత్రాలు...ఎట్సెట్రా....:

పేరు : లింగేశ్వర ప్రసాదు
ఇంటి పేరు : చింతావారి
యూసర్ పేరు : చిలిపి @ చింతకాయ.కాం
పాస్ వర్డ్ : * * * * * ( పాసు వర్డ్ బలం చుసుకొండి @@@@@@)

మన వాడి పేరు చింతావారి లింగేశ్వర ప్రసాదు.... ఎన్నొ పూజలు చేసి.. చేసి... ఆ శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ప్రసాదం అని ఈ పేరు పెట్టారు..అది కాస్తా.. చిలిపిగా మారింది..
...పాసువర్డ్ బలం ఏంటో మన వాడికి అర్థం కాలేదు....పాసువర్డ్ బలం పక్కనే...స్క్రీన్ మీద ఒక చిన్న చింత పిక్క బొమ్మ తిరుగుతూ ఉంది... సర్లే 'పొ'మ్మన్నట్లు "తరువాత" విభాగానికి...దూకాడు.. ...అంతే... వెంటనే... పాపాల చిట్టా చుపుతూ..ఒక పాప్ అప్ వచ్చింది...అందులొ "మీ బొంద..పాసువర్డ్ చాలా బల హీనం గా ఉన్నది.." అని రాసి ఉంది..

...మన వాడికి చిర్రెత్తుకొచింది.... వెంటనే.. ఒక గ్లాసెడు బూస్ట్ తాగి... బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ...అని.. మూతి తుడుచుకుంటూ...ఇంకో నాలుగు చుక్కలు నొక్కాడు... పాసువర్డ్ బలం చింతపిక్కలు.. ఒకటి నుంచి... నాలుగు కి పెరిగాయి...మన వాడు... విజయ గర్వంతో....గింగిరాలు తిరిగాడు... @@@@@@

ఇక తరువాత... పాసువర్డ్ ని గుర్తు తెచ్చే సూచకపు ప్రశ్న ని ఎంచుకోమని రాసి ఉంది...అందులోనుంచి తడుముకోకుండా..."మీరు మొదటి సారి చింతపండు కొన్న దుకాణం పేరు" ని ఎంచుకుని.. ముందుకు సా....గా...డు...

ఇక చివరి విభాగము...మానవ నిర్ధారణ అంటే... ఏంటంటారా...అదేనండీ..
"స్వయంచాలిత సరళ సూత్ర యంత్రముల"(Automated Software Registration robos) బారి నుండి ..తప్పించుటకు.... చింతకాయ.కాం వారి ఈ రెండు సమధానములు తెలిపి...మీ ఈ కార్యక్రమం పూర్తి చెయ్యండి.." అని చూసి...స్కేలు తో మార్జిన్లు కొట్టి మరీ రడీ అయ్యిపొయ్యాడు...
(దీనికి సాధారణంగా ..ఏ గజిబిజి గా రాసిన అంకెల బొమ్మనో...లేదా.. పదాన్నో గుర్తించమంటారు కదా....మరి మన చింతకాయ వారు ఏమడిగారో ....చూడండి.. )

అందులో మొదటి ప్రశ్న.."క్రింద చూపిన పటముని పరిశీలించి..సరి అయిన చిత్రాన్ని పోల్చి జత చేయుము.."
(లంబకోణము..అల్పకోణము..అధికకోణము..వృత్తము..ధీర్ఘ వృత్తము )


ఇక రెండవ ప్రశ్న...ఎంటంటే... "కలన గణితం లోని.. ఈ సులభమైన ప్రశ్నలని..సాధించండి..నిజ్జం మనుషులని నిరూపించుకొండి..."
జవాబులని.. పక్కన ఉన్న పెట్టెలో వరుసగా టైపరా ఢింభకా..."

...చెమటొడ్చి...ఎట్లా అయితేనేమి...అన్నీ సాధించి.. చివరగా ఉన్న "పదండి ముందుకు..పదండి తొసుకు " అనే బటన్ ని ఒక్క తొపు తోసాడు "చిలిపి" ....

ఉత్కంఠతో... ఎదురు చూస్తున్న ..మన వాడికి.. 'నాలుగూ 'సున్నా' 'నాలుగూ' (404) రూపం లొ సున్నం మిగిలింది...విస్తా ఆంతర్జాల బ్రౌజర్ ఏడు (VISTA IE 7 ) మహిమకి బేజారయ్యడు... "ఇంకేం చెస్తాం... అడ్జస్ట్ అవ్వుదాం" ...అనుకుని..."మరల దించు" బటన్ ని మీటాడు...చింతకాయల బుట్ట మళ్ళీ దిగ సాగింది....!!!!!

7 comments:

రాధిక said...

నాకు ఏమీ అర్దం కాలేదండి

వెంకట రమణ said...

బాగుంది.

Dileep.M said...

చాలా సరదాగా ఉందండీ మీ చింతకాయల భాగోతం

Unknown said...

హహహ...

Koteswara sarma said...

mama.........

Blog... Kathi, Keka, Arupu, Merupu........

కొత్త పాళీ said...

fresh comedy. cool.

Sita said...

nee bhasha lo Po.Pa.Na :))

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter