తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు
దవిలి మృగతృష్న లో నీరు త్రాగ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
భర్తృహరి రాసిన ఈ సుభాషితం...సుదర్శన్ పట్నాయక్ చదివాడొ లెదో తెలీదు కాని ...అతని కళ ని చూసినవారందరూ ...దీనిని ఒక సారి గుర్తు చేసుకొవాలి...
మనందరం ఇసుక గూల్లు కట్టిన వాల్లమే...అయితే ఇసుకలొ ఉండే ఆ అనకువ ని అందంగా అపురుపమైన శిల్పం రూపం లొ మార్చచ్చు అన్న ఆలొచన...ఇదిగో కింద ఫొటొ లొ చూపినట్లు చెక్కగలగిన సృజనాత్మకతకి జొహార్లు
పికాసో, రవివర్మ ల కళల తర్వాత ..నేటి కాలంలో ఆకట్టుకునే కళల్లో ..తప్పకుండా ఈ సైకత శిల్పాలు(ఇసుకతొ చేసిన శిల్పాలు)నిలుస్తాయి....నాకు ఈ సైకత శిల్పాలని మేడం తుస్సాడ్స్ తో .. ఇంకా జూలియన్ బేవర్ 3డి స్ట్రీట్ ఆర్ట్ తో.. పొల్చి చుడాలనిపిస్తుంది ...జీవకల కలిగిన మేడం తుస్సాడ్స్ మైనపు బొమ్మల ని చూసి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే ... అలాగే విన్నూత్నమైన 3డి స్ట్రీట్ ఆర్ట్...మన కనులకు చక్కని విందు చేస్తుంది..
ఈ ఇసుక బొమ్మలని చూసి ...ఆ సౌందర్యం వెనుక ఉన్న సాధనని ప్రశంసించకుండా ఉండలేము..ఒరిస్సా లో మొలకెత్తిన ఈ అరుదైన కళని ప్రస్తుతానికి కేవలం ఒక 30-40 మంది అభ్యసిస్తున్నారు...అలల అంచుల్లొ చేరిగిపొతాయని తెలిసినా ...ఈ శిల్పాలనితయారు చెయ్యాలన్న ఆసక్తే ...ఈ సైకత శిల్పకారులని ప్రేరేపిస్తుంది..
Sunday, July 22, 2007
సైకత శిల్పాలు
"లేఖిని తో శక్తిమంతం" Kesari at 7/22/2007 09:16:00 AM
Labels: 3d art, sand art, sudarshan patnaik
Subscribe to:
Post Comments (Atom)
|
3 comments:
అత్భుతకళాకారుడు సుదర్శన్ పట్నాయక్. తివిరి ఇసుమున సుందరాంగిని సృష్టించవచ్చు.. వీక్షకుల మనసు రంజింపవచ్చు...భర్తృహరి సుభాషితమ్ము తిరిగ వ్రాయవచ్చు.
అయ్యా, సుదర్శన్ గారు ఇక్కడెక్కడో న్యూయార్క్ లో తాజ్ ప్రదర్శిస్తున్నారని చదివాను. అదేనా ఇది? మంచి టపా. నెనర్లు.
@వికటకవి గారూ...
అవునండీ.. మీరు చదివినది ఈ సైకత శిల్పాల గురించే..! మీక్కూడా...మరిన్ని నెనర్లు..!
Post a Comment