మా బ్లాగానందం ని బ్లాగులు రాయమని...రాసిన...పారడి.. :-)
"మనీ" సినిమాలోని " వారెవ్వా ఏమి ఫేసు...అచ్చు హీరో లా ఉంది బాసూ" పాటకి... ఈ బ్లాగు పారడీ ...( క్రింద Youtube వీడియో ని ఆన్ చేసి...సరి కొత్త లిరిక్స్ చదవండి...)
~~~ ~~~ ~~~
వారెవ్వా ఏమి బ్లాగు...పచ్చని పైరల్లే ఉంది సాగు....
వస్తుంది కూడల్లో ఫస్టు...మరి చేసెయ్యి కొత్త పోస్టు... ||వారెవ్వా ఏమి బ్లాగు..||
పిచ్చెక్కి నెట్టిజెన్స్..కామెంట్సిచ్చేలా చెయ్యి బ్లాగ్సు....
చెప్పింది చెయ్యరా...నీవేరా ... మాక్స్ రేటింగ్సు.. ||వారెవ్వా ఏమి బ్లాగు..||
వీవెన్ టెక్నిక్ కన్నా.. ఏం తక్కువ నీకైనా...
యెన్నారై బ్లాగుల్లోనా.... ఎవరెక్కువ నీకన్నా...
కవితలు..జోకులు...వాతలు..కోతలు రావా నీకైనా..
రానారే అయినా పుడుతూనే.. .' రాయల ' స్టార్ అయ్యిపోలేదయ్యా..
తెగించే సత్తా నీకుంటే .. తెలుగులో కొత్తే నీదయ్యా...
విహారి.. కొత్తపాళి..
నల్లమోతు.... జ్యోతి..
రాధిక. సౌమ్య..
తొటరాముడు... అదర్సు
మొత్తంగా అందరూ... అయ్యిపొవాలొయ్ నీ ఫాన్సు... ||వారెవ్వా ఏమి బ్లాగు..||
సోది..సొల్లు..నస ... అంటారే ...బయటంటే....అక్కడ చేసే పనులే... బ్లాగుల్లో చేస్తుంటే ..
ఓహొ అంటూ.. జే కొడతారు... తేడా ..బాక్అప్పే...!!
నీ బ్లాగే బాగుంది అంటారు...నీ సృజనే సూపర్ అంటారు...
అత్యుత్తమ బహుమతులిస్తారు...అందరికీ గురువు ని చేస్తారు...
బాగుంది కాని ప్లాన్.. పల్టీ కొట్టిందొ ఏమి కాను..
బేకారు బాత్ మాను.. జర బ్లాగర్ లో అవ్వు జాయిను.. ||వారెవ్వా ఏమి బ్లాగు..||
అసలు పాట సాహిత్యం...
వరెవ్వ ఎమి ఫేసు.. అచ్చు హీరో లా ఉంది బాసు..
వచ్చింది సినిమా చాన్సు.. మరి వేసెయ్ మరొ డోసు...
పిచ్చెక్కి ఆడియెన్సు ..రెచ్చిపొయేలా చెయ్యి డాన్సు...
చెప్పింది చెయ్యరా.. నీవేరా ముందు డేసు..
అమితాబ్బచ్చన్ కన్నా ఎం తక్కువ నువ్వైనా..
హాలివుడ్ లొ అయినా ఎవరెక్కువ నీకన్న..
ఫయిటు.... ఫీటు.... ఆటా.... పాటా..... రావా నీకైనా..
చిరంజీవైనా పుడుతూనె మెగాస్టారయ్యిపొలెదయ్యా..
తెగించె సత్తా చూపించందే సడన్ గా స్వర్గం రాదయ్యొ...
బాల్లయ్య.. వెంకటెష్...నాగర్జున నరేష్.. రాజెంద్రుదు సురేష్.. రాజశేఖరు అదర్సు..
మొత్తంగా అందరు అయ్యిపొవాలొయ్ మఠాషు..
గూండా రౌడి దాదా అంటారె బయటుంటె.. ఇక్కడ చెసే పనులే సినిమాల్లొ చూపిస్తే..
ఒహొ అంటూ జెయ్ కొడ్తారు..తేడా మేకప్పె..
నువ్వుంటె చాల్లే అంటారు.. కథెందుకు పోన్లె అంటారు..
కటౌట్లు గట్రా కడ్తారు...టికెట్లకి కొట్టుకు చస్తారు
బాగుంది కాని ప్లాన్.. పల్టి కొట్టిందో ఏమి కాను..
బేకారు భాతు మాను.. జర ..దారూ తగ్గించు ఖాను..
Wednesday, August 22, 2007
||వారెవ్వా ఏమి బ్లాగు..||...బ్లాగు సాంగ్....పది బ్లాగులు...
"లేఖిని తో శక్తిమంతం"
Kesari
at
8/22/2007 07:50:00 AM
Click to write your comments(
13)
Labels: 10 top blogs, blog, Koodali, Money
సుప్రీంకోర్టు జిరాక్స్ షాప్...( 40 ps per Page ) ....
కోర్ట్‌తీర్పు డాక్యుమెంట్స్ అందలేదని అయిదుగురిని బెయిల్ మీద వదిలేశారటకదా...(అదేనండి...టాడా ..సంజయ్‌దత్..గుర్తొచ్చిందా) ...ఇది విని ఇంక నేను మా మేనేజర్ తో చెప్పి ఇండియా ప్రయాణమవుతున్నా.....ఎందుకంటే...మరి ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ ..అంటే... దగ్గర దగ్గరగా ఒక నాలుగున్నర లక్షల మందిని బెయిల్ మీద రేపో మాపో వదిలెయ్యాలి కదా... వాల్లందరికీ మరి ఆ డాక్యుమెంట్లేవో ఇయ్యాలంటె..ఎలా..? అందుకే నాకొక బ్రహ్మాండమయిన అవుడియా అయ్యింది...అదే "సుప్రీం కోర్ట్ జిరాక్స్ సెంటర్"...ఒక పే...ద్ద... చెయిన్ జిరాక్స్ సెంటర్ కాన్సెప్ట్ తో....దేశమంతటా ..ప్రతీ కోర్ట్ దగ్గరా జిరాక్స్ షాపు లు పెట్టి ....తీర్పు ప్రతులన్నింటినీ 40 పైసల కే జిరాక్స్ తీసి మన కోర్టులకి ఇచ్చేస్తే......ఏదొ ఉడుతా భక్తి గా దేశానికి సేవ చేసినట్లూ ఉంటుంది...(మన తెలుగు బ్లాగర్ల కి 50% డిస్కౌంట్ అండొయ్...త్వర పడండి...)
అయినా...ఆరేల్ల కఠిన శిక్ష పడ్డవాడు .....నెల శిక్ష కూడా కాకుండా పేపర్లు లెవ్వని బెయిల్ అడగటమేంటొ.....అదేదో కింది కోర్ట్ CMM level - 5 ఆడిట్ లో తప్పు చేసి పట్టుబడినట్లు..... సుప్రింకోర్ట్ ఇచ్చెయ్యడమేంటొ...
దీని తర్వాత మరి ఈ ఖైదీ లంతా...తీరిగ్గా..తీర్పుని చూస్తూ... డవుట్ క్లారిఫికేషన్ సెషన్ చేస్తారేమో కోర్ట్ తో....హతవిధీ..
"లేఖిని తో శక్తిమంతం"
Kesari
at
8/22/2007 02:41:00 AM
Click to write your comments(
0)
Thursday, August 9, 2007
ఇక "నెహ్రూగిరి" తో "సంజయ్ దత్" ..అఛ్ఛా ఖైదీ...56 ( AK 56 )
సంజయ్ దత్ జైల్లో నెహ్రూ గారి లాగా....పుస్తకాలు... డైరీ..లు రాయటం మొదలెట్టాడు...ఈ "నెహ్రూగిరి" మొదలెట్టి రాసిన డైరీ లో ఒక పేజీ....ఇదిగో...
* * * * * * * *
"చట్టం తన పని తాను చేసుకు పొతుంది...చేసుకుపొయింది కూడా..."
చీకటి ప్రపంచం తో స్నేహం ఈ చీకటి గదికి నన్ను చేర్చింది... ఒక AK56 ..నలభై యెనిమిదేల్లకి నాలో తూటాలు దించింది...కౌరవుల పాపం పండటానికి 14 యేల్లు పడుతుందని మహాభారతం లో పాండవుల అరణ్యవాసం నిరూపించినట్లు... నా పాపం ఇదిగొ ఇలా 14 యేల్ల తరువాత ఇప్పుడు పండింది...
మార్చి 12(1930).....ఆ మహాత్ముడు..నా బాపూ...ఉప్పు సత్యాగ్రహం కోసం "దండి" యాత్ర చేస్తే ...అదే మార్చి 12(1993)న కొందరు భారత మాత ఉప్పు తిని ...ఆమెపైకి ముంబాయి పేలుళ్ళ ద్వార దండ యాత్ర చేసారు...
సహాయ నిరాకరణ ఉద్యమం తో..బ్రిటీషు పాలకులను మూడు చెరువుల నీల్లు తాగించిన మహాత్మా గాంధీ కి 1922 లో..ఇదే జైల్లో...ఇదే ..6 యేళ్ళ శిక్ష విధించారట..నేను..ఈ పవిత్ర భారత దేశానికి నా సత్ప్రవర్తన చూపించి ఈ ఆరేల్ల శిక్ష "సాధించ" గలిగా...హ ..నాకూ బాపూ కి పొలికా...? ఇంకా నా మీద జనాల్లో ఉన్న అభిమానం కాకపోతేనూ... కానీ... ఎక్కడొ ఆశ...మరి నన్ను కూడా....శిక్షాకాలం ముగియకుండానే ..గాంధీ లాగా.. రెండేళ్ళకే వదిలేస్తారా...ప్చ్..ఏమో....భగవంతుడా...
దక్షిణ ఆఫ్రికా లొ ...జైల్లో ఉన్నప్పుడు గాంధీ తమిళం నేర్చుకున్నారట ..పుస్తకాలు చదివే మంచి అవకాశంగా దాన్ని ఆయన భావించారట...
**నేను కూడా..తమిళమో..తెలుగో...నేర్చుకుంటా...బయటకి వచ్చాక...నా సినిమాలు నేనే రీ మేక్ చేసుకుంటా అన్ని భాషల్లో.... :) హ...
చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఇంక ఎంతో చెయ్యాల్సి ఉంది....!!! ఇక్కడ ఒక కొత్త జీవితం మొదలెడ్తా......
** మరిన్ని పుస్తకాలు చదువుతా..... నాలా ఎవ్వరూ తప్పు చెయ్యకుండా నా అనుభవాలను... జీవన పాఠాలను...పుస్తకాలు గా రాస్తా....
** నా అల్లరితో జైలర్ లింగం మావల బడతం పడతా ..
** కరడు గత్తిన తీవ్రవాదులకి .."జాదూ కి..ఝప్పీ .." రుచి చూపిస్తా....యావజ్జీవ కారాగారులకి,ఉరి శిక్ష పడిన వారు...ప్రతి నిమిషమూ ఆనందించేట్లు చేస్తా.......
****....అఛ్ఛా ఖైదీ 56 (AK 56) అనిపించుకుంటా....!!!
"లేఖిని తో శక్తిమంతం"
Kesari
at
8/09/2007 02:39:00 AM
Click to write your comments(1 comments
Labels: AK56, Nehrugiri, Sanjay Dutt
Wednesday, August 1, 2007
వెతుకు.....వెతుకు.... వెతకాలీ.....
హా...ఏంటీపైత్యం...అనుకుంటున్నారా.....ఇంటర్నెట్ ప్రపంచం లోమనం రోజూ ఎన్నో రకాల గాలింపులు చేస్తున్నాం...తెలియనిదేదయినా..ఉంటే... మొట్ట మొదట వెతికేది ...గూగుల్ లోనే కదా.. మరి..గూగుల్ శాస్త్రమా...వ్యాపారమా..వ్యాపకమా అని అనుకునేముందు... కొంచెం వెతుకులాట గురించి...మట్లాడుకుందాం..
"ఫుడ్ లేకపొయినా.. బెడ్ లేకపొయినా...పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా..." నుండి..
"నీ కోసమే ఈ అన్వేషణ.. నీ ధ్యాస లో...ఈ ఆలాపన" అనే విరహ గీతాల స్థాయికీ చేరుతుంది ...
ఇంతేనా..ఈ వెతలూ... ఈ వెతుకులాటలు ..అన్వేషణ లు... శోధన లు...గాలింపులు... జాలాలు... చాలా రకాలు...
సత్యాన్ని...ఒకరు వెతుకుతుంటే...శాంతిని మరొకరు వెతుకుతుంటారు...:)
తమిళ నాట.. వీరప్పన్ ని వెతకటానికి ప్రభుత్వాల ఆటలు... , ప్రపంచ శాంతి పేరున..లాడెన్ కోసం.... బుష్ చేసిన వెతుకు'లాట'లు...
సో... ఈ వెతుకులాటలన్నింటినీ మించి..... 'వెతకటా'నికి దాదాపు గా సమానార్థం సాధించుకున్న పదం గూగుల్ ( google , googling )...పుట్టబొయే పాపకి పేరు పెట్టడం నుంచి.. ..చంద్ర మండలం పై మానవుడి ప్రయోగాల ఫలితాల గురించి....ఏదైనా క్షణాల్లొ.. వెతికి మన లోగిలిలో ఉంచేదే గూగుల్..!!
"లేఖిని తో శక్తిమంతం"
Kesari
at
8/01/2007 08:12:00 PM
Click to write your comments(
2)
|