Thursday, August 9, 2007

ఇక "నెహ్రూగిరి" తో "సంజయ్ దత్" ..అఛ్ఛా ఖైదీ...56 ( AK 56 )


సంజయ్ దత్ జైల్లో నెహ్రూ గారి లాగా....పుస్తకాలు... డైరీ..లు రాయటం మొదలెట్టాడు...ఈ "నెహ్రూగిరి" మొదలెట్టి రాసిన డైరీ లో ఒక పేజీ....ఇదిగో...

* * * * * * * *

"చట్టం తన పని తాను చేసుకు పొతుంది...చేసుకుపొయింది కూడా..."

చీకటి ప్రపంచం తో స్నేహం ఈ చీకటి గదికి నన్ను చేర్చింది... ఒక AK56 ..నలభై యెనిమిదేల్లకి నాలో తూటాలు దించింది...కౌరవుల పాపం పండటానికి 14 యేల్లు పడుతుందని మహాభారతం లో పాండవుల అరణ్యవాసం నిరూపించినట్లు... నా పాపం ఇదిగొ ఇలా 14 యేల్ల తరువాత ఇప్పుడు పండింది...

మార్చి 12(1930).....ఆ మహాత్ముడు..నా బాపూ...ఉప్పు సత్యాగ్రహం కోసం "దండి" యాత్ర చేస్తే ...అదే మార్చి 12(1993)న కొందరు భారత మాత ఉప్పు తిని ...ఆమెపైకి ముంబాయి పేలుళ్ళ ద్వార దండ యాత్ర చేసారు...

సహాయ నిరాకరణ ఉద్యమం తో..బ్రిటీషు పాలకులను మూడు చెరువుల నీల్లు తాగించిన మహాత్మా గాంధీ కి 1922 లో..ఇదే జైల్లో...ఇదే ..6 యేళ్ళ శిక్ష విధించారట..నేను..ఈ పవిత్ర భారత దేశానికి నా సత్ప్రవర్తన చూపించి ఈ ఆరేల్ల శిక్ష "సాధించ" గలిగా...హ ..నాకూ బాపూ కి పొలికా...? ఇంకా నా మీద జనాల్లో ఉన్న అభిమానం కాకపోతేనూ... కానీ... ఎక్కడొ ఆశ...మరి నన్ను కూడా....శిక్షాకాలం ముగియకుండానే ..గాంధీ లాగా.. రెండేళ్ళకే వదిలేస్తారా...ప్చ్..ఏమో....భగవంతుడా...

దక్షిణ ఆఫ్రికా లొ ...జైల్లో ఉన్నప్పుడు గాంధీ తమిళం నేర్చుకున్నారట ..పుస్తకాలు చదివే మంచి అవకాశంగా దాన్ని ఆయన భావించారట...
**నేను కూడా..తమిళమో..తెలుగో...నేర్చుకుంటా...బయటకి వచ్చాక...నా సినిమాలు నేనే రీ మేక్ చేసుకుంటా అన్ని భాషల్లో.... :) హ...

చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఇంక ఎంతో చెయ్యాల్సి ఉంది....!!! ఇక్కడ ఒక కొత్త జీవితం మొదలెడ్తా......

** మరిన్ని పుస్తకాలు చదువుతా..... నాలా ఎవ్వరూ తప్పు చెయ్యకుండా నా అనుభవాలను... జీవన పాఠాలను...పుస్తకాలు గా రాస్తా....

** నా అల్లరితో జైలర్ లింగం మావల బడతం పడతా ..

**
కరడు గత్తిన తీవ్రవాదులకి .."జాదూ కి..ఝప్పీ .." రుచి చూపిస్తా....యావజ్జీవ కారాగారులకి,ఉరి శిక్ష పడిన వారు...ప్రతి నిమిషమూ ఆనందించేట్లు చేస్తా.......

****....అఛ్ఛా ఖైదీ 56 (AK 56) అనిపించుకుంటా....!!!

1 comment:

Happy World said...

Hi kesari,
your blog is simply superb. It is a mix of so man matters.

Regards,
Santhosh

http://santhlavvi.googlepages.com

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter