కోర్ట్‌తీర్పు డాక్యుమెంట్స్ అందలేదని అయిదుగురిని బెయిల్ మీద వదిలేశారటకదా...(అదేనండి...టాడా ..సంజయ్‌దత్..గుర్తొచ్చిందా) ...ఇది విని ఇంక నేను మా మేనేజర్ తో చెప్పి ఇండియా ప్రయాణమవుతున్నా.....ఎందుకంటే...మరి ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ ..అంటే... దగ్గర దగ్గరగా ఒక నాలుగున్నర లక్షల మందిని బెయిల్ మీద రేపో మాపో వదిలెయ్యాలి కదా... వాల్లందరికీ మరి ఆ డాక్యుమెంట్లేవో ఇయ్యాలంటె..ఎలా..? అందుకే నాకొక బ్రహ్మాండమయిన అవుడియా అయ్యింది...అదే "సుప్రీం కోర్ట్ జిరాక్స్ సెంటర్"...ఒక పే...ద్ద... చెయిన్ జిరాక్స్ సెంటర్ కాన్సెప్ట్ తో....దేశమంతటా ..ప్రతీ కోర్ట్ దగ్గరా జిరాక్స్ షాపు లు పెట్టి ....తీర్పు ప్రతులన్నింటినీ 40 పైసల కే జిరాక్స్ తీసి మన కోర్టులకి ఇచ్చేస్తే......ఏదొ ఉడుతా భక్తి గా దేశానికి సేవ చేసినట్లూ ఉంటుంది...(మన తెలుగు బ్లాగర్ల కి 50% డిస్కౌంట్ అండొయ్...త్వర పడండి...)
అయినా...ఆరేల్ల కఠిన శిక్ష పడ్డవాడు .....నెల శిక్ష కూడా కాకుండా పేపర్లు లెవ్వని బెయిల్ అడగటమేంటొ.....అదేదో కింది కోర్ట్ CMM level - 5 ఆడిట్ లో తప్పు చేసి పట్టుబడినట్లు..... సుప్రింకోర్ట్ ఇచ్చెయ్యడమేంటొ...
దీని తర్వాత మరి ఈ ఖైదీ లంతా...తీరిగ్గా..తీర్పుని చూస్తూ... డవుట్ క్లారిఫికేషన్ సెషన్ చేస్తారేమో కోర్ట్ తో....హతవిధీ..
Wednesday, August 22, 2007
సుప్రీంకోర్టు జిరాక్స్ షాప్...( 40 ps per Page ) ....
"లేఖిని తో శక్తిమంతం" Kesari at 8/22/2007 02:41:00 AM
Subscribe to:
Post Comments (Atom)
|
No comments:
Post a Comment