Wednesday, August 1, 2007

వెతుకు.....వెతుకు.... వెతకాలీ.....


(శోధనమున పనులు సమకూరు ధర లోన " )

సాంఘీక శాస్త్రం పరీక్ష హాల్లో..గాబరా గా జేబులన్నీ వెతుకుతున్న విద్యార్థి ని...
"ఏమి వెతుకుతున్నావు రా నాయనా అని" పంతులు గారు అడిగితే...
"భారత రాజ్యాంగం".. మాస్టారూ... ఇక్కడే ఎక్కడో పెట్టా "..అని నాలిక్కరుచుకున్నాడట...

నాకు తెలిసినంతవరకూ...ఇప్పుడు.....వెతకటం అనేది అసలు ఒక కళ...ఒక శాస్త్రం...ఒక వ్యాపారం...ఒక వ్యాపకం...కొంతమందికయితే...ఇదే జీవితం మరి...

హా...ఏంటీపైత్యం...అనుకుంటున్నారా.....ఇంటర్నెట్ ప్రపంచం లోమనం రోజూ ఎన్నో రకాల గాలింపులు చేస్తున్నాం...తెలియనిదేదయినా..ఉంటే... మొట్ట మొదట వెతికేది ...గూగుల్ లోనే కదా.. మరి..గూగుల్ శాస్త్రమా...వ్యాపారమా..వ్యాపకమా అని అనుకునేముందు... కొంచెం వెతుకులాట గురించి...మట్లాడుకుందాం..

అసలు జీవితం లో ..ఈ వెతుకులాటనేది.....చేతికి అందకుండా అమ్మ దాచిన పప్పు బెల్లం దగ్గర మొదలయి...మట్టి హుండీల్లో.. నాన్న చొక్కాల్లో.. ..చిల్లర పైసల కోసం వెతికే పేజీ కి.... అక్కడినుండీ...పరీక్షల్లో ..జానెడు జేబుల్లొ రాజ్యాంగాన్ని వెతికే..లంకె కి చేరుతుంది..

"ఫుడ్ లేకపొయినా.. బెడ్ లేకపొయినా...పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా..." నుండి..
"నీ కోసమే ఈ అన్వేషణ.. నీ ధ్యాస లో...ఈ ఆలాపన" అనే విరహ గీతాల స్థాయికీ చేరుతుంది ...

ఇంతేనా..ఈ వెతలూ... ఈ వెతుకులాటలు ..
అన్వేషణ లు... శోధన లు...గాలింపులు... జాలాలు... చాలా రకాలు...
అందులో.. మచ్చుక్కి...ఇదిగో ఇలా...

సత్యాన్ని...ఒకరు వెతుకుతుంటే...శాంతిని మరొకరు వెతుకుతుంటారు...:)
దేవున్ని దోవులాడేవారు కొందరయితే... వేరే గ్రహాల్లో జీవానికి జాలాలేసే వారు మరి కొందరు...
నరాలు..నాడులు...వెతుకుతూ.. లేని రోగాలు వెతికీ మరి అంటగట్టే డాక్టర్లు కొందరు..
తమిళ నాట.. వీరప్పన్ ని వెతకటానికి ప్రభుత్వాల ఆటలు... , ప్రపంచ శాంతి పేరున..లాడెన్ కోసం.... బుష్ చేసిన వెతుకు'లాట'లు...

ఇక మనదగ్గర... ప్రతి పక్షమేమో పాలక పక్షంలో ని తప్పులు వెతుకుతుంటే... పాలక పక్షం...ప్రతి పక్షం చరిత్రని వెతికి మరీ "కడిగేస్తానంటుంది.."

పురాణాల్లో.. శ్రీరాముడు...రావణుడు అపహరించిన సీతమ్మవారి కోసం వెతగ్గా......శ్రీకృష్ణుడు...తను అపహరించని...శమంతక మణి కోసం వెతికిన వైనం,..వెతుకుతూ వారు సాధించిన లోక కళ్యాణం...తెలియంది కాదు..

...వంద కోట్ల చిరునవ్వుల్ని.. సుందర స్వప్నాల్ని వెతికే మరో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు..ఈ కుల్లు రాజకీయాల్లో..అంజనం వేసి వెతికినా ...కనపడతారా..? వెతకటం మొదలెడితే..అదేదొ సబ్బు ప్రకటన లొ లాగా.."ఇంక మీరు వెతుకుతూనే ఉంటారు.."....

సో... ఈ వెతుకులాటలన్నింటినీ మించి..... 'వెతకటా'నికి దాదాపు గా సమానార్థం సాధించుకున్న పదం గూగుల్ ( google , googling )...పుట్టబొయే పాపకి పేరు పెట్టడం నుంచి.. ..చంద్ర మండలం పై మానవుడి ప్రయోగాల ఫలితాల గురించి....ఏదైనా క్షణాల్లొ.. వెతికి మన లోగిలిలో ఉంచేదే గూగుల్..!!
స్నేహితులని వెతకటానికి ఆర్కుట్.... ( Orkut)

చలనచిత్రాలని వెతకటానికి యూట్యూబ్.... ( Youtube)

వెతక పొయిన తీగ కాలికి తగిలినట్లుoడే ఆడ్ వర్డ్స్...(ప్రకటన పదాలు..).లతో....( AdWords)
చంకలో..పిల్లాడినెట్టుకుని..ఊరంతా వెతికే భయం లేకుండా... గూగుల్ డెస్క్ టాప్..(Google DeskTop)


ప్రపంచం లోని ఙ్ఞానాన్నంతటినీ....ఒక చోట చేర్చి..."శోధనమున పనులు సమకూరు ధర లోన " అని..నిరూపిస్తుంది....కాబట్టి...అందుకే..వెతుకు.. వెతుకూ... వెతకాలి.. !!!
అన్వేషణా రసికులకు గూగుల్ ..కౌగిలి లో...కొన్ని శోధనా చిట్కాలు...:

2 comments:

రానారె said...

వెతుకులాట గురించి ఒక సంపాదకీయం రాసిపడేశారు :)
Thanks for the vedio.

రాధిక said...

వెతుకు..వెతుకు...వెతకాలి...తెలుసుకోవాలి....సాధించాలి ...

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter