యేట యేట వరదొచ్చె, యేట యేట కరువొచ్చె | మూట మీద మూట కట్టేనా మా నాయకులు | యేటి పాలు చేసినారమ్మో మా బతుకులు ||
చెరువులన్ని పూడ బెట్టె.... కాలనీలు కట్టబట్టె | కోట్లకు పడగెత్తిరె మా నాయకులు | నోట్ల మన్ను కొట్టినారమ్మ.. మా బతుకులు||
రెక్కలిరిచి దుక్కి దున్ని బీడు భుమిని సాగు చెస్తె | నకిలి మందుల కాపు కాసెనా మా నాయకులు | మందు దాగి సచ్చెటందుకె మా బతుకులు||
భూమి నమ్మి సాగు చెస్తె, గింజ రాలక కరువు్పుడితె | గ్రాంటులన్ని మింగినారమ్మొ మా నాయకులు | ఒట్టి చెయ్యి చూపినాఆరమ్మొ మా బతుకులు||
పొద్దుగూకె యాల వరకు ..పోరలంతా తాగి తూలి | మాకు మాకు చిచ్చు పెట్టెనా మా నాయకులు | తొలు బొమ్మలాటలయ్యెన మా బతుకులు ||
సదువుకున్న సాములంతా... సాయమెవ్వరు రాకపొయిరి | రాబందులు రాజ్యమెలె రాజకీయం రంగులు మారె | మేక వన్నె పులుల య్యొ మా నాయకులు | గొర్రె మార్కు ఓటు బ్యాంకులమె... మా బతుకులు ||
ఆదమరచి ఓటెస్తె, అందినకాడికి దోసుకుంటరు | మాటలు నమ్మి పదవులిస్తె, మళ్ళి మళ్ళి నంజుకుంటరు | కీలెరిగి వాత పెట్టాలె మా నాయకులకు |
This Video and lyrics are taken from VoteItRight !!
http://www.facebook.com/voteitright.india