యే దిల్ మాంగే నో మోర్ సూపర్ మార్కెట్స్ అండీ..... ఎక్కడ చూసినా.. మోర్లు...ఫ్రేష్ లు...అపోల్లో లు...హెటెరో లు.... ఇవన్నీ అవసరమా అసలు....
పోనీ ఇవన్ని ఎమైనా అక్షయపాత్రలు ..కల్ప వృక్షాలా...?అంటే.... ఒక వస్తువు దొరికితే...ఒకటి దొరకదు... సామాన్లు దొరికితే కూరగాయలు దొరకవు... దొరికినా ఆ ఫ్రిజ్ లలో ఉండి.. అన్నీ పిచ్చి పిచ్చి గా ఉంటాయి...
పని చెసే వారు అక్కడి ఉద్యొగులు కాని వారి సొంత దుకాణం కాదు కదా,కాబట్టి వాల్లకి ఎమీ పట్టి ఉండదు... ఎందుకంటే... కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి వారు జవాబుదారీ కాదు.... ఎదొ సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఖర్మ కాలి ...సమయం లేక చచ్చులో పుచ్చులో చూడకుండా కొనుక్కుని పోతారని ధీమా...
రైతు కి కూరగాయలు అమ్మడం అనేది ఒక వృత్తి ...మరి ఈ ఛైన్ సూపెర్ మార్కెట్ల లో పని చేసే వారిది ఒక ఉద్యోగం... రెంటికీ ఎంత తేదా ఉందొ కదా.... సొంత ఇంటికి అద్దె ఇంటికీ ఉన్న తేడా అంత... ... ఫలితం నిరాశ... !! రేపు మనం వ్యవసాయానికి ఇతర దేశాల సాయం అడగాల్సి వస్తుందేమో....
పోనీ మందుల దుకానాలని తీస్కుంటె... అవి కూడా అంతే... అన్ని మాత్రలు ఉండవు... పేరు కి చైన్ దుకాణాలు.... అమ్మేవి మళ్ళీ కొన్ని మందులే... అవేవో ఆసుపత్రి పక్కనే ఉన్న మాములు దుకానాల్లొ కొనుక్కుంటే సరి... అన్నీ లభ్యం...
మందుల దుకాణం కొసమని... ఎంతొ పెట్టుబడి పెట్టి ...సంబంధిత కోర్సులు చేసి ..ఇన్నెళ్ళుగా అదే ఆధారంగా బతుకుతున్న వాల్లని దెబ్బతీయటం తప్ప ఈ అర కొర చైన్ దుకానాల వల్ల ఒరిగె లాభం ఏంటి.. ?
సరయిన ఉత్పత్తులు ..సరయిన ..సరసమయిన ధర లకి దొరికేట్లు మనకి మనం సాధించుకోవాలి...
మన రైతు బజార్లని మనమే కాపాడుకోవాలి... మన మందుల దుకాణాలు... మన కిరాణ దుకాణాలకి మనమే చేయూతనివ్వాలి...
అవసరమయిన ... లోకల్ గా దొరకని వాటికే చైన్ బజార్ లని పరిమితం చెయ్యాలి...
ఇరానీ చాయ్ పిజ్జా హట్ లో ఉండకూడదు... సీతాఫలాలు స్పెన్సర్లో అక్కర్లేదు... అరటి పండ్లకి బ్రాండ్ స్టిక్కర్లొద్దు...
రైతు బజార్లని బేజార్ చేసి ..రైతుల ని ముంచుతున్న ఈ సూపర్ మార్కెట్లు ఇంక నాకొద్దు బాబో....
మీరు కూడా ...ఇలాగే అనుకుంటున్నట్లయితే.... యీ కమ్యూనిటీ లో చేరండి......
http://www.orkut.co.in/Main#Community?cmm=97871926
Thursday, January 21, 2010
యే దిల్ మాంగే నో మోర్....
"లేఖిని తో శక్తిమంతం" Kesari at 1/21/2010 08:37:00 AM
Subscribe to:
Post Comments (Atom)
|
1 comment:
చాలా బాగా ఉంది. విశాఖ పట్నంలో మా ఇంటి దగ్గర ఒక సూపర్ మార్కెట్ ఉంది. మామూలు షాపు అది. దొరకని వస్తువు ఉండదు. రీటైల్ వాణిజ్యం లో సూపర్ మార్కెట్ లో పిన్ నుంచి ప్లేన్ దాకా దొరుకుతాయి అంటారు గానీ బజారుకి విమానం కొనుక్కోవడానికి ఎవరూ పోరు కదా. మనకి కావల్సిన వస్తువులు మరీ ఖరీదు వెరైటీ కాని జీలకర్రా, ఆవాలు లాంటివే కదా. అలానే హోల్ సేలు రైస్ షాపు ఓనరూ.. ఇలా అందరూ నాన్నారికి పరిచయం. ఒక పెర్సనల్ టచ్. మేమూ విధేయం గా అక్కడే కొంటాం. అదీ పెర్సనల్ టచ్చే ! మేము రెగ్యులర్ కస్టమర్లం కదా అని వాళ్ళు మనకి తక్కువ ఖరీదుకి వస్తువులివ్వరు. కానీ ఆ నమ్మకం కోల్పోకూడదని నాణ్యత మీద తప్పకుండా దృష్టి పెడతారు. చేపల మార్కెట్ నుంచీ, రైతు బజారు దాకా విశాఖ పట్నం లాంటి చిన్న చిన్న పట్టణాల్లోనైనా బ్రతికున్న ఈ సాంప్రదాయం మనమే నిలబెట్టుకోవాలి. అవి నిల్చి ఉంటాయి కూడా. కోల్డు స్టోరేజీ లో కూరగాయల కన్నా, రైతు బజారు రకాలు మంచివని తెలుసుకుంటున్నారు జనం. నెలలో ఓ నాలుగు రోజులు 'కారు చవక !' అంటూ ఆఫర్లిచ్చే బజార్ల వెంట పడటం మన బుద్ధి తక్కువే ! మీరన్నట్టు సరైన టైం తీరకపోవడం వినియోగదార్ల పాలిట శాపం లా తయారయింది.
Post a Comment