Saturday, July 25, 2009
కన్నులతో చూసేది... కన్నులకి సొంతమునా....a miracle of eyes part 1
"లేఖిని తో శక్తిమంతం"
Kesari
at
7/25/2009 07:51:00 PM
Click to write your comments(1 comments
Labels: eyes, miracle, optical illusion, steriogram
వామ్మో హైదరాబాద్...!!!
భలే నగరం...భలే నగరం...
మహా నగరం...మహా నగరం...
హై'ధరా' బాదు నగరం.. ఆదరా బాదరా జీవితాల నగరం..
సుందర స్వప్నాలంటూ...ఎండ మావులకై పరిగెడుతున్న వింత మానవుల నగరం ...
ఇరానీ హొటల్లతో..ఘరానా వేషాలతో
నిషా యెక్కి తూగుతున్న పరేషాను నగరం...
మమ్మీ డాడీ లంటూ "అమ్మ,నాన్న" మరచిన డమ్మీ ప్రేమల నగరం ...
చైల్డ్ కేర్ సెంటర్లో బాల్యం కోల్పొయిన...హ్రుదయపు ఫ్రకంపనల నగరం
ఆకలితో అలమటిస్తున్న ప్లాట్ఫాం హ్రుదయాల ఆక్రోషాల నగరం
సినీ ఇకిలింపుల వీక్లీలు ,చార్మినారు సిగరెట్లు, హై రేంజింగ్ హోండాలే నగర యువత తొలి మెట్లై
ఫాషన్ల తూటాలతొ తునా తునకలైన నగరం
అరాచకాలకే ఇది రాజధాని నగరం దగాకోర్లకిది భాండాగారం
జూదాలతొ వాదాలతొ అలసిపోయిన నగరం
కాస్టులని ..బాంబ్లాస్టులని.. టేస్ట్ పోయిన నగరం
మానవత్వాన్ని చంపి...స్వార్థ జీవం పొసుకున్న నగరం
ఆర్జనకే అమ్ముడు పోయిన దుర్జనుల నగరం
డబ్బుల కక్కుర్తితో డిగ్రీలమ్ముతున్న నగరం
జబ్బులతో అంతస్థులు కడుతున్న డాక్టర్ల నగరం
ఫలితం లేని కోట్లాటల అసెంభ్లీ నగరం
రాజకీయ బాజాలతొ కుళ్ళిపోయిన నగరం
మహాత్ములంతా అవాక్కై నిలచినట్టి టాంకుబండు నగరం
కొత్త కొత్త "టెక్కు"లలో చిక్కినట్టి నగరం ....
ఇది హై"ధరా"బాద్ ..ఇది హై"దగా"బాద్..హై"డర్"బాద్ ..హైడ్రా బాడ్..
(1999 లో .. ఇంటర్మీడియట్ అయ్యాక కొత్తగా...మొదటి సారి హైదరాబాదు కి వచినప్పుడు.. ఇక్కడి పట్టణ జీవితం మీద నా అభిఫ్రాయం రాసా.... ఇప్పుడు ఎక్కడో సర్టిఫికేట్ల మధ్యలో ఆ కాగితం కనపడితే... దాన్ని ఇలా బ్లాగుకీడ్చా...!! )
"లేఖిని తో శక్తిమంతం"
Kesari
at
7/25/2009 06:00:00 PM
Click to write your comments(1 comments
Labels: hyderabad
|