Saturday, July 25, 2009

కన్నులతో చూసేది... కన్నులకి సొంతమునా....a miracle of eyes part 1

దేవతల కే కాదు ...మనకీ దివ్య దృష్టి ఉందని నిరూపించుకునే అవకాశం ఇదిగో ఇక్కడే .......

3డి బొమ్మల్లని కల్లతో కనిపెట్టడం/చూడటం నాకో మంచి సరదా.... లోపల దాగి ఉన్న బొమ్మని చూశాక కలిగే సంతోషం.. ఒక విజయోత్సాహం....


ఎవరికి వారే కనిపెట్టి చూడాల్సిన... మరొకరితో పంచుకోలేని ఆనందాన్ని ... ఈ క్రింది వింత బొమ్మలని చూసి పొందండి....


ఇవి చూడటమెట్లాగో తెలుసుకదా...? ...

ఎమీ లేదండీ... తీక్షణంగా ...మధ్యలో ( మెల్ల కన్ను లా పెట్టి...) బొమ్మని తదేకంగా చుడండి..... బొమ్మలొ మరొక బొమ్మ కనపడుతుంది....లాలనగా....!! అలా కండ్ల కి మాంచి వ్యాయామం... మనసుకి ఉల్లాసం.... మరింకేం.... మీ దివ్య దృష్టి ని పరీక్షించుకోండీ..

( Click on the image to maximise and then practice)

ఇక్కడ కాండీ లలో దాగి ఉన్న మరో కాండీ లని గుర్తించండి..




ఒక అందాల భామని... కనుక్కోండి....ఈ బొమ్మ చూస్తూ ఉండి పోవటం ఖాయం..!!





1..2..3...4...5..6..



సీతాకోక చిలుక




అలాగే షార్క్ ని..




స్ప్రింగ్ ఒకటి భలే గా... ఉంది ఇందులో




శని గ్రహాన్ని... కనిపెట్టగలరా ఇందులో..?




వామ్మో హైదరాబాద్...!!!


భలే నగరం...భలే నగరం...
మహా నగరం...మహా నగరం...
హై'ధరా' బాదు నగరం.. ఆదరా బాదరా జీవితాల నగరం..
సుందర స్వప్నాలంటూ...ఎండ మావులకై పరిగెడుతున్న వింత మానవుల నగరం ...

ఇరానీ హొటల్లతో..ఘరానా వేషాలతో
నిషా యెక్కి తూగుతున్న పరేషాను నగరం...

మమ్మీ డాడీ లంటూ "అమ్మ,నాన్న" మరచిన డమ్మీ ప్రేమల నగరం ...
చైల్డ్ కేర్ సెంటర్లో బాల్యం కోల్పొయిన...హ్రుదయపు ఫ్రకంపనల నగరం
ఆకలితో అలమటిస్తున్న ప్లాట్ఫాం హ్రుదయాల ఆక్రోషాల నగరం

సినీ ఇకిలింపుల వీక్లీలు ,చార్మినారు సిగరెట్లు, హై రేంజింగ్ హోండాలే
నగర యువత తొలి మెట్లై
ఫాషన్ల తూటాలతొ తునా తునకలైన నగరం

అరాచకాలకే ఇది రాజధాని నగరం దగాకోర్లకిది భాండాగారం
జూదాలతొ వాదాలతొ అలసిపోయిన నగరం
కాస్టులని ..బాంబ్లాస్టులని.. టేస్ట్ పోయిన నగరం

మానవత్వాన్ని చంపి...స్వార్థ జీవం పొసుకున్న నగరం
ఆర్జనకే అమ్ముడు పోయిన దుర్జనుల నగరం
డబ్బుల కక్కుర్తితో డిగ్రీలమ్ముతున్న నగరం
జబ్బులతో అంతస్థులు కడుతున్న డాక్టర్ల నగరం

ఫలితం లేని కోట్లాటల అసెంభ్లీ నగరం
రాజకీయ బాజాలతొ కుళ్ళిపోయిన నగరం
మహాత్ములంతా అవాక్కై నిలచినట్టి టాంకుబండు నగరం
కొత్త కొత్త "టెక్కు"లలో చిక్కినట్టి నగరం ....

ఇది హై"ధరా"బాద్ ..ఇది హై"దగా"బాద్..హై"డర్"బాద్ ..హైడ్రా బాడ్..

(1999 లో .. ఇంటర్మీడియట్ అయ్యాక కొత్తగా...మొదటి సారి హైదరాబాదు కి వచినప్పుడు.. ఇక్కడి పట్టణ జీవితం మీద నా అభిఫ్రాయం రాసా.... ఇప్పుడు ఎక్కడో సర్టిఫికేట్ల మధ్యలో ఆ కాగితం కనపడితే... దాన్ని ఇలా బ్లాగుకీడ్చా...!! )

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter