Friday, July 27, 2007

పొ.ప.న -- *LOL* ( పొట్ట పగిలి నవ్వ౦డి)


వయ్యస్ పోగర్ నిర్మా!!..వయ్యస్ పోగర్ నిర్మా!!..

'బాబు' లోని తెలుపు...వయ్యస్ తో..వచ్చి౦ది...

ర౦గ౦ లో..నేతల్ని.. తళ తళ గా..కడిగేను..!!

ఇప్పుడు ..అర్థమయ్యి౦దా..మేము..ఈయన్నే CM గా ఎ౦దుకు...ఎన్నుకున్నామో..!!? :)) ..lol..(పొపన)

...
తాత్పర్యము..

పార్థా..!! వయస్సు వలన వచ్చు వగరు తీవ్రత చే...ప్రపంచమును.. తళతళ లాడించ వచ్చును...
'చంద్రు'ని లో..తెలుపు ని.. అనగా పౌర్ణమి ని తెచ్చునది.. ' వయస్సే.'
'బాబు' కి..అనగా పసి పాపలకు...తమ నిజ తేజముని...కలిగించునదీ.. 'వయ్యస్సే...'
ఇదియే... మన 'వయ్యస్సు'.. 'ఖర్మ' సిద్ధాంతం...

Thursday, July 26, 2007

చి లి పి @ చిం త కా య . కాం



నేటి మన కథానాయకుడి పేరు....."చిలిపి". (ఇదేమి పేరంటారా...కొంచెమాగండి..ఈ బ్లాగోతం అంతా మరి వీడి... చిలిపి పనుల గురించే) ...ఇతను.. సాలెగూడు లో సాగుబడి చేద్దామని తెలుగు వెబ్ సంతలన్నీ వెతగ్గా..వెతగ్గా... దొరికిందొక..వింతైన చోటు...అదే చింతకాయ.కాం ....
అంతే ...మన వాడికి చింతకాయని చుసేసరికి ...మౌస్ ....మనసు..ఆగలేదు...క్లిక్క్ మనిపించాడు..
హొంఫుట హాం ఫట్ అని ప్రత్యక్షమయ్యింది..


అందమయిన హొంపుట..ఎదర..హెడర్ లో...అటూ ఇటూ పేజీ కి ..చింతకాయల జే పీ జీ లు వ్రేలాడ తీసారు...పచ్చి పచ్చి గా.. ఆకుపచ్చని చింతకాయలు...క్లిక్కితె తొక్కూడుతాయా అన్నట్లున్న వాటిని చూసి.. మనవాడి..నోరూరింది..
అసలే..."ఆవలిస్తే ప్రేగులు
లెక్క పెట్టగలిగి
...యూ ఆర్ ఎల్ ఇస్తే పేజీలూ లెక్క పెట్టగలిగే మన "చిలిపివాడు.." ..చింతకాయ.కాం కి పది కి పన్నెండు మార్కులు వేసాడు ముందు పేజీ లొనే........
.వెను వెంటనే... "సయినప్ శాయరా ఢింభకా " బటన్ ని...క్లిక్కుమనిపించాడు...జై చింతకాయల భైరవీ...అని గట్టిగా అరచి....
ఆ మంత్రాలకి...నాల్గు చింతకాయలు రాలి...కీ బోర్డ్ మీద పడ్డాయి...
తరువాతి పేజిలో..చింత తొక్క యుసెర్ దరఖాస్తు ...అహా కాదు.. కాదు.. కొత్త చింత యుసెర్ దరఖాస్తు అలియాస్ ప్రశ్నా పత్రము..బార్లా తెరుచుకుంది బ్రౌజర్ లో... (వెనకటికెవరో ..ఈడు మీదున్న సైటు కి...స్పీడు ఎక్కువన్నట్లు..)
ముందు గా సూచనలు అని..ఈనాడు లో సంచలన వార్త సైజు లొ ఎర్రగా రాసి ఉంది.. ఒక ఇరవై ముప్పై రాసారు... వాటిని చదవటం మొదలెట్టాడు..,

1)పలక, బలపం ..స్కేలు...జామెట్రి డబ్బా..సైద్ధాంతిక కాలుక్యులేటర్ మీ చేతికి అందేంత దూరం లొ ఉంచుకొండి..
2) నిజాయితీగా... జవాబులు రాసిన వారికి... Internet Explorer 7 లో కూడా మా పేజీ..స్పీడ్ గా లోడ్ అవుతుంది...

ఇలా సాగాయి..............

అన్ని సూచనలు సతికాక ...అసలు పని లో పడ్డాడు...

మొదట గా పేర్లూ...గొత్రాలు...ఎట్సెట్రా....:

పేరు : లింగేశ్వర ప్రసాదు
ఇంటి పేరు : చింతావారి
యూసర్ పేరు : చిలిపి @ చింతకాయ.కాం
పాస్ వర్డ్ : * * * * * ( పాసు వర్డ్ బలం చుసుకొండి @@@@@@)

మన వాడి పేరు చింతావారి లింగేశ్వర ప్రసాదు.... ఎన్నొ పూజలు చేసి.. చేసి... ఆ శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ప్రసాదం అని ఈ పేరు పెట్టారు..అది కాస్తా.. చిలిపిగా మారింది..
...పాసువర్డ్ బలం ఏంటో మన వాడికి అర్థం కాలేదు....పాసువర్డ్ బలం పక్కనే...స్క్రీన్ మీద ఒక చిన్న చింత పిక్క బొమ్మ తిరుగుతూ ఉంది... సర్లే 'పొ'మ్మన్నట్లు "తరువాత" విభాగానికి...దూకాడు.. ...అంతే... వెంటనే... పాపాల చిట్టా చుపుతూ..ఒక పాప్ అప్ వచ్చింది...అందులొ "మీ బొంద..పాసువర్డ్ చాలా బల హీనం గా ఉన్నది.." అని రాసి ఉంది..

...మన వాడికి చిర్రెత్తుకొచింది.... వెంటనే.. ఒక గ్లాసెడు బూస్ట్ తాగి... బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ...అని.. మూతి తుడుచుకుంటూ...ఇంకో నాలుగు చుక్కలు నొక్కాడు... పాసువర్డ్ బలం చింతపిక్కలు.. ఒకటి నుంచి... నాలుగు కి పెరిగాయి...మన వాడు... విజయ గర్వంతో....గింగిరాలు తిరిగాడు... @@@@@@

ఇక తరువాత... పాసువర్డ్ ని గుర్తు తెచ్చే సూచకపు ప్రశ్న ని ఎంచుకోమని రాసి ఉంది...అందులోనుంచి తడుముకోకుండా..."మీరు మొదటి సారి చింతపండు కొన్న దుకాణం పేరు" ని ఎంచుకుని.. ముందుకు సా....గా...డు...

ఇక చివరి విభాగము...మానవ నిర్ధారణ అంటే... ఏంటంటారా...అదేనండీ..
"స్వయంచాలిత సరళ సూత్ర యంత్రముల"(Automated Software Registration robos) బారి నుండి ..తప్పించుటకు.... చింతకాయ.కాం వారి ఈ రెండు సమధానములు తెలిపి...మీ ఈ కార్యక్రమం పూర్తి చెయ్యండి.." అని చూసి...స్కేలు తో మార్జిన్లు కొట్టి మరీ రడీ అయ్యిపొయ్యాడు...
(దీనికి సాధారణంగా ..ఏ గజిబిజి గా రాసిన అంకెల బొమ్మనో...లేదా.. పదాన్నో గుర్తించమంటారు కదా....మరి మన చింతకాయ వారు ఏమడిగారో ....చూడండి.. )

అందులో మొదటి ప్రశ్న.."క్రింద చూపిన పటముని పరిశీలించి..సరి అయిన చిత్రాన్ని పోల్చి జత చేయుము.."
(లంబకోణము..అల్పకోణము..అధికకోణము..వృత్తము..ధీర్ఘ వృత్తము )


ఇక రెండవ ప్రశ్న...ఎంటంటే... "కలన గణితం లోని.. ఈ సులభమైన ప్రశ్నలని..సాధించండి..నిజ్జం మనుషులని నిరూపించుకొండి..."
జవాబులని.. పక్కన ఉన్న పెట్టెలో వరుసగా టైపరా ఢింభకా..."

...చెమటొడ్చి...ఎట్లా అయితేనేమి...అన్నీ సాధించి.. చివరగా ఉన్న "పదండి ముందుకు..పదండి తొసుకు " అనే బటన్ ని ఒక్క తొపు తోసాడు "చిలిపి" ....

ఉత్కంఠతో... ఎదురు చూస్తున్న ..మన వాడికి.. 'నాలుగూ 'సున్నా' 'నాలుగూ' (404) రూపం లొ సున్నం మిగిలింది...విస్తా ఆంతర్జాల బ్రౌజర్ ఏడు (VISTA IE 7 ) మహిమకి బేజారయ్యడు... "ఇంకేం చెస్తాం... అడ్జస్ట్ అవ్వుదాం" ...అనుకుని..."మరల దించు" బటన్ ని మీటాడు...చింతకాయల బుట్ట మళ్ళీ దిగ సాగింది....!!!!!

Sunday, July 22, 2007

సైకత శిల్పాలు

తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు
దవిలి మృగతృష్న లో నీరు త్రాగ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు


భర్తృహరి రాసిన ఈ సుభాషితం...
సుదర్శన్ పట్నాయక్ చదివాడొ లెదో తెలీదు కాని ...అతని కళ ని చూసినవారందరూ ...దీనిని ఒక సారి గుర్తు చేసుకొవాలి...
మనందరం ఇసుక గూల్లు కట్టిన వాల్లమే...అయితే ఇసుకలొ ఉండే ఆ అనకువ ని అందంగా అపురుపమైన శిల్పం రూపం లొ మార్చచ్చు అన్న ఆలొచన...ఇదిగో కింద ఫొటొ లొ చూపినట్లు చెక్కగలగిన సృజనాత్మకతకి జొహార్లు






పికాసో, రవివర్మ ల కళల తర్వాత ..నేటి కాలంలో ఆకట్టుకునే కళల్లో ..తప్పకుండా ఈ సైకత శిల్పాలు(ఇసుకతొ చేసిన శిల్పాలు)నిలుస్తాయి....నాకు ఈ సైకత శిల్పాలని మేడం తుస్సాడ్స్ తో .. ఇంకా
జూలియన్ బేవర్ 3డి స్ట్రీట్ ఆర్ట్ తో.. పొల్చి చుడాలనిపిస్తుంది ...జీవకల కలిగిన మేడం తుస్సాడ్స్ మైనపు బొమ్మల ని చూసి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే ... అలాగే విన్నూత్నమైన 3డి స్ట్రీట్ ఆర్ట్...మన కనులకు చక్కని విందు చేస్తుంది..



ఈ ఇసుక బొమ్మలని చూసి ...ఆ సౌందర్యం వెనుక ఉన్న సాధనని ప్రశంసించకుండా ఉండలేము..ఒరిస్సా లో మొలకెత్తిన ఈ అరుదైన కళని ప్రస్తుతానికి కేవలం ఒక 30-40 మంది అభ్యసిస్తున్నారు...అలల అంచుల్లొ చేరిగిపొతాయని తెలిసినా ...ఈ శిల్పాలనితయారు చెయ్యాలన్న ఆసక్తే ...ఈ సైకత శిల్పకారులని ప్రేరేపిస్తుంది..

Saturday, July 21, 2007

Coffee with Karan (......) కల్లు విత్ కేసరి ...


తేదీ : 18 జులై 2007

సమయం : సాయంత్రం ఆరు

ప్రాంతం : కోనసీమ ఈత చెట్ల క్రింద

కార్యక్రమం : సక్సెస్ ఫుల్ టి.వి. ప్రోగ్రాం...
"కల్లు విత్ కేసరి... "లైవ్ టెలి కాస్త్
నిడివి : అయిదు నిమిషాలు

నమస్కారం... నాతొ ఈ రోజు కల్లు తాగబొయే మొదటి వ్యక్తి... ఈ ప్రాంతం లోనే బాగా పేరు మొసిన కల్లుపానంద రావు...నమస్కారమండీ..కల్లుపానంద రావు గారూ ( ఒక మట్టి ముంతలొ కల్లు అందించా)
(కల్లు (వినయంగా కెమరా వైపు ఒక దండం పెట్టి , చేతిలొకి ముంత తీసుకుంటూ )నమస్కారం ...అన్నాడు )
మీరు ఈ చుట్టుపక్కల కల్లు ఉత్పాదనకి కల్ప వృక్షమని విన్నాం..మిమ్మల్ని కలుసుకొవటం..చాలా ఆనందంగా ఉంది...కొన్ని సరదా ప్రశ్నలకి ...ఠకా ఠకా మాకు జవాబులు చెప్తారా....



ప్ర) మీకు నచ్చిన ఒక పాట...
జ) కల్లు కల్లు కలిసాయంటె ... ప్రేమ అని దానర్ధం...

ప్ర) మీకు నచ్చిన హిందీ సినిమా...

జ) కల్లు హొ న హొ

ప్ర) మీకు నచ్చిన హీరొయిన్...?
జ) కల్లు-పనా రాయ్...

ప్ర)ఆ.....మరి.. మీకు ఆమెలో నచ్చిన అంశం
జ) కల్లు

ప్ర) మీరు ఇంతవరకూ...మీ వ్యాపారం లో చేయనిది..
జ) కల్ల్-తీ..

ప్ర) మీరు మన రాష్త్రపతి గా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు
జ) అబ్దుల్ 'కల్లాం'

ప్ర) మీ భవిష్యత్ ప్రణాళిక ఎమిటో కాస్త సెలవిస్తారా...
జ) ఒకటి..ఫైవ్ స్టార్ హొటెల్ మెనుల్లోకి కల్లుని చేర్పించటం రెండు... వైజాగ్ నుండి హైద్రాబాద్ వెల్లే అన్ని విమానాల్లో ..కల్లు డ్రింక్..అందిచటం


ఆహా..చాలా చక్కగా చెప్పారండీ.... మా ప్రేక్షకులంతా ఒల్లంతా కల్లు చేసుకుని చుస్తున్నారు మీమల్ని.....
లొక కల్లు-యానార్ధం అవతరించిన కల్లు-కీ భగవాన్ మిమ్మల్ని కల్లగా..సారీ సారి కల్లులా ఛల్లగా చుడాలని..మేము కొరుకుంటున్నాం..బాయ్ బాయ్ .. కల్ మిలేంగే...





Friday, July 20, 2007

యే చికీతా...కుమస్తాస్...


2005 ఆగస్ట్ ..మా ప్రాజెక్ట్ క్లయంట్ కి ఇచ్చే రొజు వచ్చింది... నేను స్పెయిన్ కి వెళ్లాను..నా ప్రొజెక్ట్ గురించి..ఎమనుకుంటున్నరో అని కుతూహలంగా ఉంది ... నాకు వాళ్లు మాట్లాడుకుంటున్నవి అర్థం చేసుకొవటం ... దాదాపుగా అసంభవం అని తెలిసి వచ్చింది...కానీ..వాళ్ళు మట్లాడుకుంటున్నవి వింటానికి.. ఒక చెవ్వు అటు పడేశాను.....అందులో ఒక రెండు పదాలు..ఎక్కువగా వినిపించాయి..అవి..


" సీ...సీ....బాలె ..బాలె .. "


ఇంత కష్టపడి మేము చేసిన పనిని ..బాలె బాలె అని అంటున్నారేంటా అని కొంచెం ఆలొచించి.,.గూగుల్ చెయ్యగా తెలియవచ్చిందేంటంటే...'బాలే' అంటే స్పానిష్ లో సరే ( మన భాషలొ ఓ.కె. అని ;-) ) అని అర్థం...



...ఈ స్పానిష్ "బెక బెక" లు...మేము అక్కడ చాలా రోజులు భరించాము...అయినా ప్రపంచం లో చాలా ప్రాముఖ్యమైన భాషల్లొ ఒకటైన ఈ స్పానిష్ ని ఎప్పటికైనా నేర్చుకోవాలని అనిపిస్తుంది...


చాలా వరకు..వీరి యాస.. మన భాషలకి దగ్గరగా ఉంటుంది....చాలా తెలుగు పదాల్లాగా అనిపిస్తాయి కూడా....తెలుగు తో పొలిన వింతైన కొన్ని స్పానిష్ పదాలు ..వాటి అర్థాలు.. ఇదిగొ ఇక్కడ ఇంకొన్ని చెప్పనా?


స్పానిష్ లొ ..

దూడ అంటే సందేహం

దెవుడా అంటే అప్పు.. (దేవుడా...)

తింతా అంటే ఇంకు.. సిరా. (చిన్న ఫిల్లలు తింటానికి...తింతా అన్నట్లుగా )

రాణా అంటే కప్ప...( "బెక బెక" )

హొర అంటే అవర్ ( హవర్) (మన పంచాఙ్ఞము లలో ఇన్ని హొర లని సమయాన్ని లెక్క పెట్టే విధానం ఉంది )

సాలా అంటే రూం ( ఎయిర్ పోర్ట్ లొ... వీఐపి ల వెయిటింగ్ రూం కి.. "సాలా వీఐపి" అని పెద్ద పెద్ద అక్షరాలతో ..రాసినప్పుడు.. నాకు నవ్వాగలేదు... :D)

మంగొస్తా అంటే ముంగీస ...( మంగ ని అడిగి చుద్దాం..:P )

చర్ల అంటే కబుర్లు.. చాట్

వెంగా / బెంగ అంటే .. రా రమ్మని...

చిక అంటే ప్రియురాలు.. ( యే చికితా..)


ఎన్ సంచార్ అంటే సాగదీయు..పొడిగించు..


అమాంతే అంటే ప్రియుడు / ప్రియురాలు


బాల అంటే తూటా .......

మన తెలుగు పాటల్లో.. కూడా.. స్పానిష్ అప్పుడప్పుడూ వింటున్నాం కదా....
"హేయ్ చికితా ...కుమస్తాజ్..." అని గొంతు చించుకుని పవన్ కల్యాన్..పాడినప్పుడు అర్థం కాలేదు ఈ భావావేషం..(అనువదిస్తే యే పిల్లా...యేంది కతా... అని మాస్ గా..లెకపొతే..ఓ..ప్రియా...కుశలమా... అని క్లాస్ గా)



అలాగే షకలక బేబి ...పాటలొ... చివరగా "అదెదొ వస్తదా మీకు" అన్నట్లుగా సుస్మితా సేన్ వినిపించే కూత కూడ.. స్పానిష్ దె..."అడియొస్ అమిగొస్".. ..బై బై ..ఫ్రెండ్స్.. అని అర్థం ..



ఇక అమెరికా లొ స్పానిష్ విషయానికొస్తే .. ఎక్కువగా స్పానిష్ మట్లాడే వాల్లు ఉన్నారన్నది ..అందరికీ తెలిసినదే కదా..ఒకసారి అక్కడ యెదో రాష్త్రం లొ..పార్లమెంటు సమావేశాలలొ.. ఇంగ్లిష్ ని రాష్త్ర భాషగా గుర్తించడానికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు అని గవర్నర్ ఆవేశంగా అంటే ..అందరూ చెయ్యెత్తి.. "సీ" అని స్పానిష్ లొ(Si means 'Yes') అన్నారంట... అది విని ఆ గవర్నెర్ నెత్తి పట్టుకోవల్సొచ్చింది...


అలాగే... చాలా ఈంగ్లిష్ సినిమాలలో వినే ఇంకో పదం "గ్రాసియాస్" .. అంటె మన భాషలొ థాంక్స్...తెలుగు లో ..కృతఙ్ఞతలు అని....



ఇక స్పానిష్ పదాలు ఎలా ఉంటాయంటే...మీరెప్పుడైనా బాంగలూరు వెల్లారా... అక్కడ ..కన్నడ వాళ్ళ లిపి మన తెలుగు లిపి లాగానే ఉంటుంది..కాని చదివి చూస్తె వింతగా...అక్కడ కనిపించే బోర్డ్ పై...బంగలూరో...కర్నాటకో...హొటెలో..రెస్తారెంటో...ఇలా అన్ని వాల్లకే అదెంటో తెలీదన్నట్లు రాసుకున్నరేంటా అనిపిస్తుంది కదా... అలాగే స్పానిష్ కూడా......!!!




ఇంగ్లిష్ లొ చాలా వాటికి అలా "ఓఓ" అని కలిపితే ..స్పానిష్ పదాలు వచ్చేస్తాయి...... :D




Sunday, July 15, 2007

ఈనాడు - ఈ పేపర్

హాయ్...

ఈ వారం ..ఈనాడు ఈ పేపర్ ని ప్రవేశ పెట్టింది..ఇన్ని రోజులు కేవలం వార్తల సూచికలనే వెబ్ లొ (
http://www.eenadu.net/ )ఉంచిన ఈనాడు .. ఇప్పుడు కొత్తగా మొత్తం పేపర్ ని స్కాన్ చెసి చక్కగా కొత్త సైట్ http://epaper.eenadu.net/ ఉంచింది.. దీని వల్ల అచ్చం పేపర్ ని చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది..అంతే కాకుండా ఫొటొస్ ని, వార్తల ని క్లిప్ చేసుకుని దాచుకొవచ్చు ...

మా నాగార్జున సాగర్ లో కృష్ణా నది డాం గేట్స్ తెరిచిన వార్త ని ఇదిగొ ఇలా చదివితే ఎంత బాగుంటుందొ కదా..




పలక బలపం


'శ్రీ' అని అమ్మ నాన్నలు అక్షింతల బియ్యంలో దిద్దించినప్పుడు మొదలయింది మన "అక్షర అభ్యాసం"...ఈ వేడుక ఇంత శ్రద్ధగా జరిపించి ..ఒక లక్ష్యాన్ని ,దిశని యేర్పటు చేసి..వారు మన భాహ్య ప్రపంచ జీవనానికి శ్రీకారం చుట్టారు!
అప్పటి దాకా. బుడి బుడి నడకలతో ...బొసి నవ్వులతో...కేరింతలు కొడుతూ అందర్నీ అలరించిన మనం.. ఇకపై కొత్తగా "ప్రోగ్రెస్ కార్డు" లతో గర్వింప చెయ్యాలి :) ( అంటే పుత్రోత్సాహం టైప్ లో )
4-5 ఏల్లకే మనదగ్గర ఒక అద్బుతమైన లాప్ టాప్ ఉందండొయ్య్...అదే॥ మన కొత్త పలక...ఎంతో హూందాగా ఒక చేత్తో దాన్ని పట్టుకుని...పరిగెత్తుకుంటూ.. స్కూల్ కి వెల్తుంటే ఆ దర్జాయే వేరు....అప్పట్లో 2-3 రకాల పలకలుండేవి... రంగు రంగుల బార్డర్లు ....మరి పక్క వాల్లతొ మనకి అదే కదా పోటీ...ఇంక బలపాలు రాయటం కన్నా తినటం ఎక్కువ..;)...

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter